Telugu Gateway
Cinema

పుష్ప 2 విడుదల తేదీ మారింది

పుష్ప 2 విడుదల తేదీ మారింది
X

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల తేదీ మారింది. ముందు ప్రకటించినట్లు డిసెంబర్ ఆరు న కాకుండా..ఒక రోజు ముందుగానే డిసెంబర్ ఐదున ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ గురువారం నాడు అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లో ఈ సినిమా నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం జరిగింది. ఇందులోనే విడుదల తేదీ మార్పు గురించి కూడా వెల్లడించారు. అభిమానుల కోరిక మేరకు డిసెంబర్ ఐదు న సినిమా విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పుష్ప 2 సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని దక్కించుకోవటంతో ఇప్పడు రెండవ భాగంపై అందరిలో ఆసక్తినెలకొంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ లు కీలకపాత్రలు పోషించారు. పుష్ప 2 ది రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త కొత్త రికార్డు లు నమోదు చేయటం ఖాయం అనే ధీమాతో చిత్ర యూనిట్ ఉంది. ఇప్పటికే బుక్ మై షో లో ఏడు లక్షల మంది ఇంట్రెస్ట్స్ తో ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ఇప్పటికే రికార్డు స్థాయి బిజినెస్ జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.న్యూ రిలీజ్ తేదీ తో అల్లు అర్జున్ న్యూ లుక్ ను కూడా విడుదల చేశారు.

Next Story
Share it