చిరంజీవి సినిమాలో పూరీ జగన్నాథ్
మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా లూసిఫర్. తెలుగులో చిరంజీవి హీరోగా దీన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి శనివారం నాడు కీలక అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. చిరంజీవి సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూరీ తీరని కోరిక నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నర్సీపట్నం నుంచి వెండి తెరపై ఓ వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చిన ఆ కుర్రాడు అరకొర వేషాలు వేసి..స్టార్ డైరక్టర్ గా ఎదిగాడని ప్రశంసించాడు. కానీ పూరీ కల అలా కలగా మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పూరీ డైరక్ట్ గా షూటింగ్ లో సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనతోపాటు చార్మి కౌర్ కూడా ఉన్నారు. చిరంజీవి ఖైదీ డ్రెస్ లో కన్పిస్తున్నాడు. పూరీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ప్రస్తుతం లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే జనగణమన సినిమా కూడా లైన్ లో పెట్టారు. ఇప్పుడు పూరీ సినిమాలో నటిస్తుండటం విశేషం.