Telugu Gateway
Cinema

పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం

పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాన్మ‌ర‌ణం
X

ఈ వార్త నిజం కాద‌ని ఎవ‌రైనా చెపితే బాగుండు. కన్న‌డ నాట స్టార్స్ నుంచి సామాన్యుల వ‌ర‌కూ అంద‌రి ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఇంత‌టి షాకింగ్ న్యూస్ వారిని తాకింది శుక్ర‌వారం నాడు. అదేంటి అంటే ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో క‌న్న‌డ‌నాట యువ‌ర‌త్న‌గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచారు. జిమ్ లో ఎక్స్ ర్ సైజ్ లు చేస్తుండ‌గా ఆయన తీవ్ర అనారోగ్యం పాల‌వ‌టంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుత ఆయ‌న ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు. దీంతో క‌న్న‌డ‌నాట విషాద‌ఛాయ‌లు అలుముకున్నారు. రాజ్ కుమార్ క‌న్న‌డ సూపర్ స్టార్ గా ఉన్నారు. ఒక‌ప్ప‌టి క‌న్న‌డిగుల అభిమాన హీరో రాజ్ కుమార్ త‌న‌యుడే ఈయ‌న‌. 46 సంవ‌త్స‌రాల అతి త‌క్కువ వ‌య‌స్సులో ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం పాల‌వ‌టం అంద‌రినీ షాక్ కు గురిచేసింది. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్త విని శాండల్‌వుడ్‌ సినీ ప్రుముఖులతో పాటు ఇతర టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆయన మృతి సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. భారత సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి న‌టుడుగానే కాకుండా...ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌టం ద్వారా కూడా పునీత్ రాజ్ కుమార్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణంతో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. ఆయ‌న్నూ అంద‌రూ అప్పూగానే పిలుస్తారు.

Next Story
Share it