అభిమానుల భావోద్వేగాలతో సెలబ్రిటీల ఆటలు
వెబ్ సిరీస్ కోసం అభిమానులతో ఆడుకున్న పునర్నవి భూపాలం
ఫేక్ ప్రేమలు. ఫేక్ భావోద్వేగాలు. ఫేక్ నవ్వులు. అంతా ఫేక్. ఏది నిజమో..ఏది అబద్ధమో. అంతా మార్కెట్ మాయాజాలం. సినిమా సెలబ్రిటీలు మొదలుకుని బిగ్ బాస్ సెలబ్రిటీలు తమకు వచ్చిన ఇమేజ్ ను తమ అభిమానులను బోల్తా కొట్టించేందుకు వాడుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ పునర్నవి భూపాలం ఎపిసోడ్. ఈ బిగ్ బాస్ 3పార్టిసిపెంట్ రెండు రోజులుగా తన అభిమానులను పెద్ద సస్పెన్స్ కు గురిచేసింది. తొలుత వేలికి ఉంగరం ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో అందరూ పునర్నవి ఎంగేజ్ మెంట్ అని ఫిక్స్ అయ్యారు. ఈ వార్త అగ్రశ్రేణి పత్రికల సైట్లతోపాటు వెబ్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. తర్వాత రోజు ఓ యువకుడి ఫోటోతో సహా ఫోటో పెట్టేయటంతో పునర్నవి పెళ్లి చేసుకోబోయేది ఈ అబ్బాయే అంటూ వార్తల హల్ చల్ చేశాయి.
సీన్ కట్ చేస్తే ఇదంతా వెబ్ సీరిస్ కోసం చేసిందనే విషయం తేలిపోయింది. అంటే రెండు రోజుల పాటు పునర్నవి తన అభిమానుల భావోద్వేగాలతో ఆడుకున్నది అని తేలిపోయింది. రెండు రోజుల పాటు చేసింది అంతా పబ్లిసిటీ స్టంట్ అని తాజా ప్రకటన నిరూపించింది. ఉద్భవ్‌తో కలిసి "కమిట్ మెంటల్" వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో నవంబర్ 13 నుంచి ఇది ప్రసారం కానుంది. "తప్పలేక ఒప్పుకున్నాను. ఇంకా ముందుంది అసలైన క్రేజీ రైడ్. మీరు కూడా ఇందులో భాగస్వాములు కండి" అని పిలుపునిచ్చింది.