Telugu Gateway
Cinema

త్వ‌ర‌లో సెట్స్ పైకి పీఎస్ పీకె28

త్వ‌ర‌లో సెట్స్ పైకి పీఎస్ పీకె28
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో సినిమా ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అంశంపై ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు సోమ‌వారం నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌మావేశం అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త్వ‌ర‌లోనే పీఎస్ పీకె28 సినిమా సెట్స్ పైకి రానుంద‌ని తెలిపారు. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అయ్యార‌న్నారు.

గ‌తంలో హ‌రీష్ శంక‌ర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు చేసిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా టాలీవుడ్ లో రికార్డులు నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీమ్లానాయ‌క్ తోపాటు హ‌రిహ‌ర వీర మ‌ల్లు సినిమాలు పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. వీటితోపాటు ప‌లు ప్రాజెక్టులు ప‌వ‌న్ కోసం వేచిచూస్తున్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

Next Story
Share it