Telugu Gateway
Cinema

ఇండియా గేటు ముందు బైక్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఇండియా గేటు ముందు బైక్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
X

జాత‌ర షురూ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 28వ సినిమా ప్రీ లుక్ కూడా విడుద‌లైంది. ప‌వ‌ర్ స్టార్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఈ లుక్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఇండియా గేట్ ముందు బైక్ పై స్టైల్ గా కూర్చున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్ ఆయ‌న అభిమానులను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాతో గ‌బ్బ‌ర్ సింగ్ కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ కాబోతుంది. హ‌రీష్ శంక‌ర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు క‌ల‌సి చేయ‌నున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించ‌నున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ కు జోడీ క‌ట్ట‌నున్న భామ ఎవ‌రు..ఇత‌ర న‌టీన‌టుల విష‌యాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీమ్లానాయ‌క్, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలు పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇవి పూర్తికాగానే హ‌రీష్ శంక‌ర్ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌నుంది. దీంతో పాటు మ‌రికొన్ని చిత్రాలు కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చాలా కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ తో రెండ‌వ ఇన్నింగ్స్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి సినిమాల విష‌యంలో దూకుడు చూపిస్తున్నారు.

Next Story
Share it