Telugu Gateway
Cinema

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫోటో లీక్

పవన్ కళ్యాణ్  కొత్త సినిమా ఫోటో లీక్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పీఎస్ పీకె27 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 17వ శతాబ్దపు కాలం నాటి పిరియాడికల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తు‍న్నారు. దీని కోసం అప్పటి పరిస్థితులకు సరిపోయేలా హైదరాబాద్‌లో సెట్స్‌‌ వేసి పవన్‌పై భారీ యాక్షన్‌ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్‌ సెట్స్ లోని పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్‌ వారియర్‌ దుస్తుల్లో కన్పిస్తున్నాడు. ఎమ్‌ఎమ్‌ రత్నం నిర్మిస్తున్న ఈసినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌లు కథానాయికలు.

Next Story
Share it