సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్
BY Admin28 Feb 2021 12:14 PM

X
Admin28 Feb 2021 12:14 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సారి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. వచ్చే సంక్రాంతి టాప్ హీరోల మధ్య రసవత్తర పోటీకి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు సినిమా 'సర్కారు వారి పాట' సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
ఇది కూడా 2022 సంక్రాంతి బరిలో నిలవనుంది. పిరీయాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్, జాక్వెలెన్ ఫెర్నాండెజ్ లు సందడి చేయనున్నారు. ఈ సినిమాకు హరిహర వీర మల్లు అనే పేరు ప్రచారంలో ఉంది.
Next Story