ప్రాజెక్ట్ కె పై పెరుగుతున్న హైప్

కమల్ హాసన్ కు 20 నుంచి 30 కోట్ల రూపాయల మధ్య, దీపికా పదుకొనె కు పది కోట్లు, అమితాబ్ బచ్చన్ తో పాటు ఇతర నటీ నటులకు కలిపి పది కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా. అయితే ప్రాజెక్ట్ కే సినిమా లో కమల్ హాసన్ షూటింగ్ జరిగే రోజులు చాలా తక్కువగా ఉంటాయని చెపుతున్నారు. రెమ్యూనరేషన్స్ అన్ని కలిపి సుమారు 210 కోట్ల రూపాయలు అయితే...నిర్మాణ ఖర్చు 400 కోట్ల రూపాయలుగా చెపుతున్నారు. సహజంగా ఏ పెద్ద సినిమా కు అయినా కూడా నిర్మాణ వ్యయంలో ఎక్కువ భాగం రెమ్యూనరేషన్స్ కే వెళుతుంది. కానీ ఇక్కడ నిర్మాణ వ్యయంగా చూపిస్తున్న 400 కోట్ల రూపాయలపై మాత్రం పలు అనుమానాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా కు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఇప్పటివరకు ఏ సినిమాకు రాని రికార్డు ధరలు వచ్చినా కూడా నిర్మాత అశ్విని దత్ ఇంకా వాటిని ఓకే చేయలేదు అని చెపుతున్నారు. సినిమా బడ్జెట్ లో పెద్ద మొత్తం ఈ మార్గం ద్వారానే వచ్చే అవకాశం ఉంది అని టాక్. మొత్తానికి ప్రాజెక్ట్ కే బజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది అనే చెప్పాలి.