Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ 'పుష్ప' సందడి రెడీ

అల్లు అర్జున్ పుష్ప సందడి రెడీ
X

అల్లు అర్జున్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే 'పుష్ప' చిత్ర యూనిట్ ఆయన ఫ్యాన్స్ కు పండగ చేయనుంది. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన వీడియోను ఈ నెల7వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అది ఎలా ఉండబోతుందో తాజాగా విడుదల చేసిన స్వల్ప నిడివి వీడియోలో చూపించింది. ఈ వారం 'పుష్ప' చిత్రం నుంచి అనేక అప్ డేట్స్ వస్తున్నాయని, అభిమానులు సిద్ధంగా ఉండాలని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

"లోడు దింపతండాం" అంటూ చిత్తూరు యాసలో ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పంచుకోడంతో అల్లు అర్జున్ అభిమానులు కుషీకుషీగా ఉన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it