Telugu Gateway
Cinema

డ్రాగన్ కొత్త షెడ్యూల్ కు రెడీ

డ్రాగన్ కొత్త  షెడ్యూల్ కు రెడీ
X

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ తదుపరి షెడ్యూల్ జోర్డాన్ లో మొదలు కానుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్ వెల్లడించకపోయినా ఈ సినిమా కు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఈ పేరు ప్రచారంలో ఉంది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందుకు వెళుతూ ఎన్టీఆర్ ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇప్పుడు ఈ లుక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

బయటకు వచ్చిన ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ లుక్స్ పై విమర్శలు వచ్చినా ఈ న్యూ లుక్స్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంటే...ఈ సినిమాకు రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.

.

Next Story
Share it