Telugu Gateway

కొత్త అసోసియేష‌న్ ఆలోచ‌న లేదు

కొత్త అసోసియేష‌న్ ఆలోచ‌న లేదు
X

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ కొత్త గ్రూపు ఏర్పాటు చేయ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. దీనికి సంబంధించి పేరు కూడా ఖ‌రారు అయిన‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. కొత్త‌గా ఎన్నికైన త‌మ క‌మిటీ స‌భ్యులు రాజీనామా చేస్తున్నార‌ని ప్ర‌క‌టించిన ప్ర‌కాష్ రాజ్ ఈ అంశంపైనా స్పందించారు. మా'కు పోటీగా మరో కొత్త అసోసియేషన్‌ ప్రారంభించే ఆలోచన లేదని నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. ఆత్మ, ప్రేతాత్మ, పరమాత్మ అంటూ ఏవీ లేవని వెల్లడించారు. ''ఓడినా.. గెలిచినా ప్రశ్నిస్తూనే ఉంటా. విష్ణును ప్రోగ్రెస్‌ కార్డు అడుగుతూనే ఉంటా. పనిచేయకపోతే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటా. గొడవలు పెద్దవి చేయకూడదనే పదవులకు రాజీనామాలు చేస్తున్నాం'' అని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు.

Next Story
Share it