Telugu Gateway
Cinema

'నెగిటివ్ ప్ర‌పంచంలోకి ' మ‌రోసారి!

నెగిటివ్ ప్ర‌పంచంలోకి  మ‌రోసారి!
X

హీరోయిన్ ప్ర‌గ్యాజైస్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'నెగిటివ్' అన్న ప‌దం ఇంత సంతోషం ఇస్తుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌న్నారు. రెండ‌వ‌సారి ప్ర‌గ్యాజైస్వాల్ క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్షలో ఆమెకు క‌రోనా నెగిటివ్ అని వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ 'నెగిటివ్ ప్ర‌పంచంలోకి ' మ‌రోసారి! అంటూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆమె బాల‌క్రిష్ణ‌తో క‌ల‌సి అఖండ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన కొద్ది రోజుల‌కే ఆమె క‌రోనా బారిన‌ప‌డ్డారు. వెంట‌నే రిక‌వ‌రి అయి ఇప్పుడు సాధార‌ణ స్థితికి వ‌చ్చేశారు.

Next Story
Share it