Telugu Gateway
Cinema

సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్

సందీప్  రెడ్డి వంగా సర్ప్రైజ్
X

కొత్త సంవత్సరం తొలిరోజే ప్రభాస్ ఫాన్స్ కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక సర్ప్రైజ్ లుక్ అందించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఒంటి నిండా బ్యాండేజ్ లతో హీరో ప్రభాస్ ఉంటే...హీరోయిన్ త్రిప్తి డిమ్రి లైటర్ తో సిగరెట్ వెలిగిస్తుంది. ఈ లుక్ చూసిన వాళ్ళు అంతా యానిమల్ ని మించి ఈ మూవీ ఉండేలా ఉంది అనే అంచనాకు వస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్ ద్వారా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంచనాలు మరింత పెంచారు అనే చెప్పొచ్చు.

సందీప్ రెడ్డి టేకింగ్ స్టైల్ కు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. ఇప్పుడు కచ్చితంగా ప్రభాస్ హీరోగా ఫస్ట్ టైం పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్న ఈ మూవీ కూడా రికార్డు లు నమోదు చేయటం ఖాయం అనే అంచనాలు ప్రభాస్ ఫాన్స్ లో ఉన్నాయి. ఇండియన్ సినిమా ఆజానుబాహుడు ని చూడండి..హ్యాపీ న్యూ ఇయర్ అంటూ దర్శకుడు ఈ లుక్ తో పోస్ట్ చేశారు. ప్రభాస్ రా అండ్ రస్టిక్ లుక్ ఆయన ఫాన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటోంది. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మూవీ లో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. స్పిరిట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం తొమ్మిది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ ఈ జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కగా...ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ కామెడీ జానర్ లో నటించాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది...ఇప్పటికే విడుదల పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ ఉన్నారు. మరో కీలక పాత్రలో సంజయ్ దత్ నటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it