Telugu Gateway
Cinema

కల్కి శివరాత్రి స్పెషల్

కల్కి శివరాత్రి స్పెషల్
X

శివ రాత్రి రోజు కల్కి చిత్ర యూనిట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని చెపుతూ కొత్త లుక్ ను విడుదల చేసింది. మే 9 న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో భారీ తారాగణమే ఉంది. కల్కి 2898 లో ప్రభాస్ కు జోడిగా దీపికా పడుకునే నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు ఉన్నారు. తాజాగా బయటకు వచ్చిన ప్రభాస్, దిశా పఠానీ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story
Share it