Telugu Gateway
Cinema

ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో !

ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో !
X

సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. నిత్యం వార్తల్లో ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అసలు షూటింగ్ మొదలు కాలేదు. అదే ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ. ఆదివారం నాడు అంటే నవంబర్ 23 న స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రి, నిర్మాతలు పాల్గొన్నారు. ఈ మూవీ ని టి సిరీస్ , భద్రకాళి ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభాస్ స్పిరిట్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కావటంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు అనే చెప్పాలి. అయితే ఈ పూజా కార్యక్రమంలో హీరో ప్రభాస్ మాత్రం పాల్గొనలేదు.

ఈ మూవీ ద్వారానే ప్రభాస్ ఫస్ట్ టైం వెండి తెరపై పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ గానే కాదు..పాన్ వరల్డ్ మూవీ గా మారబోతుంది. ఎందుకంటే ఈ సినిమాను జపనీస్, కొరియన్, మాండరీన్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. యానిమల్ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావటంతో పాటు ఇందులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తుండంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి.

Next Story
Share it