Telugu Gateway
Cinema

సలార్ షూటింగ్ ప్రారంభోత్సవంలో యశ్ సందడి

సలార్ షూటింగ్ ప్రారంభోత్సవంలో యశ్ సందడి
X

ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న 'సలార్' సినిమా షూటింగ్ పూజా కార్యక్రమం శుక్రవారం నాడు హైదరాబాద్ లో వేడుకగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి కెజీఎఫ్ హీరో యశ్ ముఖ్య అతిధిగా హాజరు అయి సందడి చేశారు. కెజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కావటంతో ఈ కార్యక్రమంలో యశ్ కూడా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ప్రభాస్, యశ్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కెజీఎఫ్ 2 టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సలార్ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ కూడా కెజీఎఫ్ 2 పనులను పూర్తి చేసుకుని ఈ సినిమాపై దృష్టి సారించనున్నారు.

Next Story
Share it