Telugu Gateway
Cinema

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

ప్రభాస్ కు గత ఏడాది మంచి విజయాన్ని ఇచ్చిన సినిమా సలార్. వరస పరాజయాల తర్వాత ఈ మూవీ వసూళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపటంతో అటు ప్రభాస్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వస్తోంది. అది కూడా జనవరి ఇరవై నుంచే. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పృద్విరాజ్ సుకుమారన్ నటించారు. మరో కీలక పాత్రలో శృతి హాసన్ నటించింది. వాస్తవానికి ఈ సినిమా గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నుంచి వస్తుంది అనుకుంటే..చాలా ముందుగా అంటే జనవరి ఇరవై నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అని చెప్పాలి. ఓటిటి లో సలార్ ఎన్ని రికార్డు లు బ్రేక్ చేస్తుందో వేచిచూడాలి.

Next Story
Share it