Telugu Gateway
Cinema

సంక్రాంతి బరిలో భారీ పోటీ!

సంక్రాంతి బరిలో భారీ పోటీ!
X

వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సందడికి రంగం సిద్ధం అవుతోంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతి రేస్ లో నిలిచి జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో భారీ సినిమా మెగా స్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ . దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కు సంబంధించి కీలక విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటి అంటే రాజాసాబ్ మూవీ రన్ టైం ఏకంగా మూడు గంటల పద్నాలుగు నిమిషాలుగా ఉంది. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటే ఇప్పటికే అమెరికా లో రాజాసాబ్ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో రన్ టైం బయటకు వచ్చింది.

భారీ బడ్జెట్ తో తెరక్కించే ప్రభాస్ సినిమాలు అన్ని ఇటీవల కాలంలో అన్ని మూడు గంటల పైనే ఉంటున్నాయి. ఇప్పుడు రాజాసాబ్ మూవీ కూడా ఆ జాబితాలో చేరింది. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను దర్శకుడు మారుతీ తెరకెక్కించగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్ తో పాటు సంక్రాంతి బరిలోనే నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన అనగనగ ఒక రాజు, రవి తేజ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా వచ్చే సంక్రాంతి బరిలోనే నిలుస్తుంది అని ప్రకటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గ్లింప్స్ ని ఇటీవల విడుదల చేశారు.

Next Story
Share it