ప్రభాస్ కొత్త సినిమా 'సలార్'
BY Admin2 Dec 2020 2:48 PM IST
X
Admin2 Dec 2020 2:56 PM IST
ప్రభాష్ కొత్త సినిమా ప్రకటించాడు. ఈ సినిమా టైటిల్ తోపాటు న్యూలుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ 2021 జనవరిలో ప్రారంభం కానుందని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఈ సినిమా 'కేజీఎఫ్' ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమాకు 'సలార్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా వెల్లడించింది.
ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ (కేజీఎఫ్ మూవీ ప్రొడ్యూసర్) నిర్మించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఓ సినిమాను తెరకెక్కించనుంది. సలార్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది.
Next Story