Telugu Gateway
Cinema

పాత ప్రభాస్ మళ్ళీ వచ్చాడు

పాత ప్రభాస్ మళ్ళీ వచ్చాడు
X

సలార్ సక్సెస్ తో ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీంతో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలు కూడా వరసగా ప్రకటిస్తూ పోతున్నాయి చిత్ర యూనిట్స్. అందులో భాగంగానే సంక్రాంతి పండగ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక సర్ప్రైజ్ లుక్ వచ్చింది. దీని ద్వారా ఫ్యాన్స్ పాత ప్రభాస్ ను చూసుకున్నట్లు అయింది అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే బాహుబలి సినిమాల తర్వాత అయన స్టైల్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. దర్శకుడు మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమాకు రాజాసాబ్ అన్న పేరు పెట్టారు. లుంగీలో సరదాగా కనిపిస్తున్న ప్రభాస్ లుక్ కూడా బాగుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమిరం దగ్గర భారీ ఎల్ఈడిపై రాజాసాబ్ కు సంబంధించిన ప్రభాస్ న్యూ లుక్ ను ప్రదర్శించారు. దీన్ని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మారుతి సినిమాలో ప్రభాస్ కు జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నట్లు చెపుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Next Story
Share it