అదరగొట్టిన ప్రభాస్

ప్రభాస్ అదరగొట్టాడు. దర్శకుడు మారుతి ఈ సారి ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించబోతున్నాడు. చెప్పినట్లే రాజాసాబ్ చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందులో ప్రభాస్ డైలాగులు...యాక్షన్ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో ఈ రిలీజ్ డేట్ ను కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ ట్రైలర్ లో ఒక డైలాగు ఉంది. స్టార్ వార్స్ అని. అన్నట్లే వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ వార్స్ జరగబోతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే సంక్రాంతి బరిలో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్నమన శంకర వరప్రసాద్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో పాటు పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ మూవీ రాజాసాబ్ కూడా సంక్రాంతి సీజన్ నే ఎంచుకుంది. ఈ రెండు సినిమాలతో పాటు నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగ ఒక రాజు సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజాసాబ్ మూవీ లో ప్రభాస్‌తో కేవలం కామెడీ, రొమాన్స్ మాత్రమే కాకుండా పవర్‌ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాజాసాబ్ ట్రైలర్ లో హై లైట్ అంటే నీళ్లలో నుంచి మొసలిని ప్రభాస్ విసిరేసే సీన్ అనే చెప్పాలి.



