ప్రభాస్..నాగ్ అశ్విన్ ల సినిమా ప్రారంభం
BY Admin24 July 2021 11:28 AM GMT
X
Admin24 July 2021 11:28 AM GMT
ఇద్దరూ ఇద్దరే. ఒకరు బాహుబలి సినిమాతో ఎక్కడికో వెళ్ళగా..దర్శకుడు నాగ్ అశ్విన్ మహా నటి సినిమాతో తన సత్తా ఏంటో చాటారు. వీరిద్దరి కాంబినేషన్ లో...వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. రకరకాల కారణాలతో ఇది జాప్యం అవుతూ వచ్చింది. అయితే గురుపూర్ణిమ సందర్భంగా ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు.
ఈ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తుంటే... హీరోయిన్ గా దీపికా పడుకొణె నటిస్తున్నారు. ప్రాజెక్టు కె వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. అమితాబచ్చన్ పై చిత్రీకరించిన సన్నివేశాలకు హీరో ప్రభాస్ క్లాప్ కొట్టారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.
Next Story