కల్కి రన్ టైం ఎంతో తెలుసా?
గతంలో ఏ భారతీయ సినిమాకు లేని రీతిలో ఈ మూవీ టికెట్స్ ప్రీ సేల్స్ సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27 న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 55 ,555 టికెట్స్ అమ్ముడుపోయి సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. యూఎస్ ఆడియెన్స్ లో కల్కి పట్ల ఉన్న అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో ఈ టికెట్స్ అమ్మకాలు చెపుతున్నాయి అనే చర్చ సాగుతోంది. ముంబై లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో వివరించిన దర్శకుడు నాగ్ అశ్విన్ అంచనాలను మరింత పెంచారు అనే చెప్పాలి. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డు లు క్రియేట్ చేయటం ఖాయం అని భావిస్తున్నారు.