Telugu Gateway
Cinema

ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

రాధే శ్యామ్ సినిమాకు సంబంధించి హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినమాకు సంబంధించి అభిమానుల కోసం హీరో తరపున తొలి అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్యగా కన్పించబోతున్నారు.

ఇటీవలే పూజా హెగ్డె పుట్టిన రోజు సందర్భంగా ఆమె కు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాధే శ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇటలీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Next Story
Share it