Telugu Gateway
Cinema

వరస రిలీజులకు ప్లాన్

వరస రిలీజులకు  ప్లాన్
X

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాళ్లకు ఫౌజీ చిత్ర యూనిట్ గురువారం నాడు కీలక విషయాన్ని వెల్లడించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 3 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ లుక్ తో విడుదల చేసిన ప్రభాస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చేతిలో గన్ పట్టుకుని... ఒంటి నిండా రక్తంతో తడిచిన ప్రభాస్ లుక్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషల్లో విడుదల కానుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వి నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం 2024 ఆగస్ట్ 16 న జరిగింది. అంటే మరో నెల రోజుల్లోనే ఈ సినిమా స్టార్ట్ అయి రెండేళ్లు పూర్తి కానుంది. ఎట్టకేలకు చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అని చెప్పాలి. ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో, కల్కి 2 , సలార్ 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it