కన్నప్ప మూవీ నుంచి న్యూ లుక్
మంచు ఫ్యామిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం చూసి చాలా సంవత్సరాలే అయింది. కొద్ది సంవత్సరాల క్రితం విడుదల అయిన వీళ్ళ సినిమాలు దారుణ ఫలితాన్ని చవి చూశాయి. దీంతో ఇప్పుడు అందరూ కన్నప్ప సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాకు బజ్ క్రియేట్ కావటానికి అవసరమైన ఏర్పాట్లు అయితే చేశారు అనే చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తో పాటు దిగ్గజ నటులు మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లు కూడా ఈ మూవీ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రభాస్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమా లో హీరోగా మంచు విష్ణు నటిస్తున్నారు. ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరో వైపు ఈ సినిమా కు నిర్మాత గా వ్యవహరిస్తున్న మోహన్ బాబు కూడా ఇందులో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడిగా ప్రీతి ముకుందన్ నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.