Telugu Gateway
Cinema

ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్ ప్రారంభం

ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభం
X

ప్రభాస్ దూకుడు మీద ఉన్నాడు. గతానికి భిన్నంగా వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఓ వైపు రాధే శ్యామ్, మరోవైపు సలార్ సినిమా చేస్తూనే ఇప్పుడు ఆదిపురుష్ లోనూ జాయిన్ అయ్యాడు. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రవుత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే 'ఆది పురుష్' సినిమా మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీని ఇంటర్నేషనల్‌ సినిమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృషన్‌ కుమార్‌లతో పాటు ఓంరావుత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఓం రవుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో సైఫ్‌ ఆలీఖాన్‌ నటిస్తున్నారు.

Next Story
Share it