Telugu Gateway
Cinema

కరోనాను తన్నేశా..పూజా హెగ్డే

కరోనాను తన్నేశా..పూజా హెగ్డే
X

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు. స్టుపిడ్ కరోనాను తన్నిపడేశానన్నారు. తాజాగా పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గత నెల 25న పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్ అని తేలిపింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. ప్రభాస్ కు జోడీగా రాధేశ్యామ్ లో, అక్కినేని అఖిల్ తో కలసి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్రంలోనూ నటిస్తోంది.

Next Story
Share it