పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్
BY Admin25 April 2021 4:29 PM GMT
X
Admin25 April 2021 4:29 PM GMT
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఆమె చేసిన సినిమాలు అన్నీ వరస పెట్టి హిట్స్ కావటంతో పూజాకు అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. ప్రభాస్ తో కలసి రాధే శ్యామ్ తో అక్కినేని అఖిల్ తో కలసి 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, రామ్ చరణ్ తో కలసి ఆచార్య సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో విజయ్ తో కలసి కూడా సినిమా ఛాన్స్ దక్కించుకుంది.
అయితే ఆమె తనకకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కోవిడ్ `బారిన పడిన తాను నిబంధనల ప్రకారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని తెలిపింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నానని వెల్లడించింది. తనను కలిసినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఎల్లప్పుడూ తన వెంటే ఉంటూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.
Next Story