Telugu Gateway
Cinema

కాస్ట్ లీ అయినా సీ ఫేసింగ్ ఇళ్లపై మక్కువ

కాస్ట్ లీ అయినా  సీ ఫేసింగ్ ఇళ్లపై మక్కువ
X

టాలీవుడ్ లో కొద్ది రోజుల క్రితం వరకు పూజా హెగ్డే టాప్ హీరో ల పక్కన సందడి చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆమె టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ లు చేస్తున్న దాఖలాలు లేవు. ఇప్పుడు తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టినట్లు కనిపిస్తోంది. ఆమె ఇప్పుడు ఏకంగా 45 కోట్ల రూపాయలు పెట్టి ముంబై లోని బాంద్రా లో సముద్రానికి అభిముఖంగా ఉండే ఒక కీలక ప్రాపర్టీ ని కొనుగోలు చేశారు. ఇది నాలుగు వేల చదరపు అడుగుల్లో ఉంటుంది.

ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి దేవా సినిమా లో నటిస్తోంది. పూజా హెగ్డే కు ఇన్‌స్టాగ్రామ్ లో 26 .6 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. పూజా హెగ్డే తెలుగు లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమాలో ఒక ప్రత్యేక పాటలు మెరిశారు. అంతకు ముందు ఆమె చేసిన ఆచార్య సినిమా, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమా లు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయిన విషయం తెలిసిందే.

Next Story
Share it