Telugu Gateway
Cinema

'నీలాంబ‌రి' గా పూజాహెగ్డె

నీలాంబ‌రి గా పూజాహెగ్డె
X

టాలీవుడ్ లో నీలాంబ‌రి అన్న‌ది ఎంత ప‌వ‌ర్ ఫుల్ పాత్రో అంద‌రికీ తెలిసిందే. న‌ర‌సింహ సినిమాలో ఈ పాత్ర‌తో దుమ్మురేపారు ర‌మ్య‌క్రిష్ణ. ఏకంగా ర‌జ‌నీకాంత్ తో ఢీ అంటే ఢీ అనేలా న‌టించారు. ర‌మ్య‌క్రిష్ణ కెరీర్ లో ఈ పాత్ర‌కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఇది అంతా ఎందుకంటే ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 'ఆచార్య‌' సినిమాలో పూజా హెగ్డె పాత్ర పేరు నీలాంబ‌రి అంట‌. ఈ విష‌యాన్ని ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.

ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త లుక్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో పూజా హెగ్డె రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా న‌టించిన విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇందులో మావోయిస్టులుగా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు క‌న్పించ‌నున్నారు.

Next Story
Share it