Telugu Gateway
Cinema

‘బ్రో ’ అంటున్న పవన్ కళ్యాణ్

‘బ్రో ’ అంటున్న పవన్ కళ్యాణ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో యమా దూకుడు మీద ఉన్నారు. అయన వరసపెట్టి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తొలిసారి పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ గురువారం నాడు టైటిల్ రిలీజ్ చేసింది. ఈ సినిమా కు ప్రచారం జరిగినట్లుగానే ‘బ్రో ’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్‌లో పాటు మోషన్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

తమిళంలో తెరకెక్కి ఘన విజయం సాధించిన ‘వినోదయ సితం ’ సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెరకెక్కించిన యాక్టర్, డైరెక్టర్ సముద్రఖనినే ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో దేవుడి పాత్రలో స్వయంగా సముద్రఖనినే నటించారు. ఈ రీమేక్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ఆ పాత్రను చేస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story
Share it