పెప్సీ ఆంటీ..నా పెళ్లికి నేనే యాంటీ
BY Admin21 March 2021 1:07 PM IST
X
Admin21 March 2021 1:07 PM IST
సీటిమార్ సినిమాకు సంబంధించి మరో లిరికల్ సాంగ్ విడుదల అయింది. నా పేరే పెప్సీ ఆంటీ..నా పెళ్లికి నేనే యాంటీ అంటూ అప్సర రాణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. పక్కా మాస్ గా ఈ పాట తెరకెక్కించారు. యూత్ ను టార్గెట్ చేసుకుని ప్రత్యేకగతంగా పెట్టినట్లు కన్పిస్తోంది. చిన్న హీరోలు...పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా ప్రతి సినిమాలోనూ ఇలా ప్రత్యేక గీతాలు పెడుతున్న విషయం తెలిసిందే.
గోపీచంద్, తమన్నాలు జంటగా నటించిన సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో గోపీచంద్, తమన్నాలు ఇద్దరూ కబడ్డీ కోచ్ లు కన్పించబోతున్నారు. సీటిమార్ టైటిల్ సాంగ్ అయితే మంచి ఆదరణ దక్కించుకుంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేకుండా ఉన్న గోపీచంద్ సీటిమార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Next Story