'పెన్నీ పుల్ సాంగ్' వచ్చేసింది
BY Admin20 March 2022 12:22 PM GMT
X
Admin20 March 2022 12:22 PM GMT
'సర్కారు వారి పాట' సినిమా నుంచి రెండవ సింగిల్ విడుదలైంది. 'ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని' అంటూ సాగే పాట ప్రోమోను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఆదివారం నాడు ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాట ద్వారా తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది మహేష్ బాబు కుమార్తె సితార . సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ సందడి చేయనుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.
Next Story