పెద్ది ట్రైలర్ విడుదల

ఒక్క క్రికెటే కాకుండా ఈ సినిమాలో ఎన్నో గేమ్స్ ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ చెప్పిన డైలాగు మీరు అందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారూ అన్నది హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఇందులో ఫుల్ మాస్ రోల్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా సంకేతాలు ఇచ్చారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన హీరో రామ్ చరణ్ పెద్ది లాంటి సినిమాలు అరుదుగా వస్తాయన్నారు. తనకు దక్కిన పెద్ది అలాంటిదే అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ తన రెండవ సినిమాకే అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ కు ధన్యవాదాలు తెలిపారు.



