రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ రికార్డ్!

రామ్ చరణ్ పెద్ది మూవీ మరో కొత్త రికార్డు నమోదు చేసింది. విడుదల అయిన 12 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ రామ్ చరణ్ న్యూ లుక్ ను విడుదల చేసింది. 2026 సంవత్సరంలో దక్షిణ భారత దేశంలో నంబర్ వన్ గ్రాసర్ గా ఈ మూవీ నిలిచినట్లు వెల్లడించారు. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన సినిమా ఒకటి 400 కోట్ల రూపాయల క్లబ్ లో చేరటం ఇదే మొదటి సారి. 300 కోట్ల రూపాయల వసూళ్లే ఒక రికార్డు అయితే..ఇప్పుడు ఇది 400 కోట్ల రూపాయలకు చేరటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు అనే చెప్పొచ్చు. అయితే థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికి వసూళ్లు ఎంత మేరకు చేరతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



