Telugu Gateway
Cinema

ఐదు రోజుల్లో 315 కోట్ల వసూళ్లు

ఐదు రోజుల్లో 315 కోట్ల వసూళ్లు
X

రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ పై మరో హీరో అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా అటు చిరంజీవి...ఇటు అల్లు అరవింద్ ఫ్యామిలీ ల మధ్య గ్యాప్ పెరిగింది అనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పలు విషయాల్లో విబేధాలు స్పష్టంగా కనిపించాయి కూడా. విబేధాలు ఎన్ని ఉన్నా కూడా అల్లు అర్జున్ ఇప్పుడు పెద్ది మూవీ విషయంలో స్పందించటం మాత్రం మంచి పరిణామంగా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓవరాల్ గా పెద్ది మూవీ ఫలితం విషయంలో మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నా కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్షన్ కు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో 315 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

ఈ తరుణంలో అల్లు అర్జున్ పెద్ది మూవీపై ఎక్స్ వేదికగా స్పందించారు. సోమవారం రాత్రి పెద్ది మూవీ చూశానని రామ్‌చరణ్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు అన్నారు. ఆయన నటన సందర్భానుసారంగా రఫ్‌గా, సహజంగా ఉండటమే కాకుండా, ఈ మూవీ కోసం శరీరాన్ని మార్చుకున్న తీరు అద్భుతం అన్నారు. డ్యాన్స్‌లో చూపించిన గ్రేస్‌ అన్నీ అసాధారణం. సినిమాలో ప్రతి సీను, ప్రతి అంశంలోనూ గ్రేస్‌ చూపించారు అని కొనియాడారు. రామ్‌చరణ్‌ను చూస్తే గర్వంగా ఉంది. ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలకు ఆయన అర్హుడు. జగపతిబాబు నటన మైండ్‌ బ్లోయింగ్‌. ఇతర నటీనటులు కూడా పాత్రలకు న్యాయం చేశారు. లీడింగ్‌ లేడీ జాన్వీ కపూర్‌ చక్కని పాత్ర పోషించింది. సినిమా కోసం శ్రమించిన సాంకేతిక నిపుణులు నిర్మాతలందరికీ అభినందనలు. సినిమాలో ప్రతి పాత్రను అత్యుత్తమంగా చూపిస్తూ, ముఖ్యంగా చరణ్‌ను మరింత ఉన్నత స్థ్థాయిలో ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానాకు నా హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Next Story
Share it