Telugu Gateway
Cinema

పెద్ది తో రామ్ చరణ్ రికార్డు

పెద్ది తో రామ్ చరణ్ రికార్డు
X

రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పెద్ది రికార్డు నమోదు చేసింది. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 292. 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. రామ్ చరణ్ సోలో హీరోగా చేసిన మూవీ లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పెద్ది నిల్చింది. ఫస్ట్ వీక్ పూర్తి అయ్యే నాటికే ఈ మూవీ వసూళ్లు మరింత పెరగటం ఖాయం. సోమవారం నాడు బుకింగ్స్ ఒకింత తగ్గినా కూడా మరికొన్ని రోజులు ఈ పెద్ది మూవీ జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. . మరో వైపు ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల మంచి స్పందన వస్తోంది. మరో వైపు హీరోయిన్ జాన్వీ కపూర్ విషయంలో తలెత్తిన వివాదం కూడా ఈ సినిమా కు కలిసి వస్తోంది అనే ప్రచారం ఉంది.

పెద్ది మూవీ లో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కుకుండా కొన్ని సన్నివేశాలను తొలగిస్తామని కూడా ప్రకటించారు. తాజాగా ఈ అంశంపై పెద్ది మూవీ లో అప్పల సూరి పాత్ర పోషించిన జగపతి బాబు కూడా స్పందించారు. దర్శకుడు చెప్పినట్లే జాన్వీ కపూర్ చేసింది అని..ఆమెను ట్రోల్ చేయటం సరికాదు అన్నారు. పెద్ది మూవీలో తన పాత్రకు రావలసినంత స్థాయిలో గుర్తింపు రావటం లేదు అని...ఏ సినిమా విషయంలో తాను ఇలా అడగలేదు అని...కానీ ఈ సినిమా విషయంలో తనకు తగిన గుర్తింపు అడిగే హక్కు ఉంది అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు ను కూడా ఇదే అడిగాను అని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

Next Story
Share it