Telugu Gateway
Cinema

ఏపీలో ఓజీ టికెట్ రేట్లు పెంపు

ఏపీలో ఓజీ టికెట్ రేట్లు పెంపు
X

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా కు హైప్ ఒక రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25 న ఓజీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సెప్టెంబర్ 25 అర్ధరాత్రి అంటే ఒంటి గంటకు ఈ సినిమా బెనిఫిట్ షో కు కూడా అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షో టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్స్ లో 125 రూపాయలు...మల్టీప్లెక్స్ ల్లో 150 రూపాయల మేర టికెట్ రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. ఈ పెరిగిన ధరలు అక్టోబర్ 4 వరకు అమల్లో ఉంటాయి అని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్నారు.

తెలంగాణ లో బెనిఫిట్ షో కు అనుమతి ఇస్తారో లేదో తెలియదు కానీ..టికెట్ రేట్ల పెంపు ఉంటుంది అని చెపుతున్నారు. దసరా సెలవులు టార్గెట్ చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదలకు ఈ తేదీని ఖరారు చేసింది. వాస్తవానికి తొలుత ఇదే రోజు బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం విడుదల అవుతుంది అని ప్రకటించినా కూడా వివిధ కారణాలతో ఇది వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటే హంగామా చేయనుంది. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటించిన సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.

Next Story
Share it