Telugu Gateway
Cinema

‘ఏ’ సర్టిఫికెట్ జారీ

‘ఏ’ సర్టిఫికెట్  జారీ
X

పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ కి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు జూరు చేసింది. గత కొంత కాలంగా ఈ సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాలో వయలెన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వటంతో పాటు పలు కట్స్ చెప్పినట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. సోమవారం నాడే ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే సెన్సార్ కంప్లీట్ కాకముందే రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశారు...టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. సెన్సార్ కాకుండా ముందే ఇలా టికెట్స్ అమ్మటం సరికాదు అని చెపుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఓపెనింగ్ బుకింగ్స్ తో పాటు ఓవర్సీస్ లో ట్రెండ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.

అయితే ఏ సర్టిఫికెట్ రావటం వల్ల కలెక్షన్స్ పై కొంత మేర ప్రభావం పడే అవకాశం ఉంది అని చెపుతున్నారు. పలు వాయిదాల అనంతరం ఓజీ ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం తర్వాత విడుదల కావటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. ఓజీ మూవీ 2 .34 గంటలుగా ఉంది. ఏ సర్టిఫికెట్ కాకుండా యూఏ సర్టిఫికెట్ పొందేందుకు నేరుగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినా కూడా ఇది వర్క్ అవుట్ కాలేదు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఫైనల్ గా సెన్సార్ బోర్డు నుంచి అనుమతి రావటం...ఓజీ ట్రైలర్ విడుదల కావటంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా విషయంలో ఉన్న గందరగోళానికి తెరపడినట్లు అయింది.

Next Story
Share it