Telugu Gateway
Cinema

చిరు కంటే చాలా స్లో !

చిరు కంటే చాలా స్లో !
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన మొత్తం సినిమాలు ఎన్నో తెలుసా?. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న బ్రో తో కలిపితే మొత్తం 28 సినిమాలే. సినిమా నంబర్ల విషయానికి వస్తే మెగా స్టార్ చిరంజీవి సినిమాలు ఇప్పటికే 154 వరకు చేరగా...అయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంకా 28 దగ్గరే ఉండటం విశేషం. కారణాలు ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా ల విషయంలో చిరంజీవి అంత దూకుడు చూపించరు అనే పేరుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ చేసిన 28 సినిమాల్లో ఏకంగా 12 సినిమాలు రీమేక్ వి ఉండటం కీలకం. గతంలో వివిధ భాషల్లో విడుదల అయి...విజయవంతం అయిన సినిమాలనే తెలుగు లో పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడుదల అయిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు కూడా రీమేక్ సినిమాలే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రో సినిమా కూడా అలాంటిదే. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం కు ఇది రీమేక్. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సముద్ర ఖని తెలుగులోనూ ఈ సినిమాకు దర్శకతం వహించారు.

అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తెలుగులో కొన్ని మార్పులు చేయటంతో పాటు...ఈ సినిమా కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తో సంభాషణలు రాశారు. తొలిసారి బ్రో సినిమా ద్వారా పవన్ కళ్యాణ్, అయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఇది సాయి ధరమ్ తేజ్ కు తొలి రీమేక్ సినిమా . వీరిద్దరి కాంబినేషన్ ను సెట్ చేసింది కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. ఈ విషయాన్నీ ఇటీవల జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయటం తప్ప...మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఏమీ అంగీకరించే ఛాన్స్ లేదు అని చెప్పొచ్చు. ఇంకా పవన్హ కళ్యాణ్ చేతిలో హరి హర వీర మల్లు, సుజీత్ దర్శకత్వం లో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it