Telugu Gateway
Cinema

పవన్ అదిరే స్టెప్పులు!

పవన్ అదిరే స్టెప్పులు!
X

టాలీవుడ్ టాప్ హీరోల్లో డాన్స్ లు అదరగొట్టేది కొంత మందే. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉండరు అనే చెప్పాలి. కాకపోతే దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో చూసిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది అనే చర్చ తెర మీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ ఈ సినిమా లో అదిరిపోయే డాన్స్ వేయించినట్లు ప్రోమో ఇండికేషన్ ఇచ్చింది అనే చెప్పాలి. దీనికి తగ్గట్లే పాటలో కూడా ఈ విషయాన్ని పెట్టారు. పవన్ కళ్యాణ్ స్టెప్పేస్తే భూ కంపం అంటోంది చిత్ర యూనిట్.

‘దేఖ్‌లేంగే సాలా’ అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ మంగళవారం సాయంత్రం రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ముందు నుంచి చెబుతున్నట్లు ఈ పాటలో పవన్ తన పవర్ మరోసారి చూపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్స్‌కి పవన్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి అనే చెప్పాలి. ఈ పాటను డిసెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ ని నిర్మిస్తోంది. ఈ పాట విశాల్ దద్లానీ పాడగా, భాస్కరభట్ల లిరిక్స్‌ అందించారు.

Next Story
Share it