Telugu Gateway
Cinema

అదిరిపోయే లుక్ లో పవన్ కళ్యాణ్

అదిరిపోయే లుక్ లో పవన్ కళ్యాణ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి శివరాత్రి సర్ ప్రైజ్ వచ్చేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను కూడా వెల్లడించింది చిత్ర యూనిట్. ప్రచారం జరిగినట్లుగానే ఈ సినిమాకు 'హరిహర వీరమల్లు'గా నిర్ణయించారు. ఇప్పటివరకూ ఈ సినిమాను పీఎస్ పీకె27 వర్కింగ్ టైటిల్ తో పిలిచారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ కన్పించనుంది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ తోపాటు ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ అదిరిపోయే రేంజ్ లో కన్పించారు. ఈ గ్లింప్స్ ,,ఫస్ట్ లుక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఫుల్ కుషీ చేస్తోంది. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. చూస్తుంటే గత పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు కన్పిస్తోంది.

Next Story
Share it