Telugu Gateway
Cinema

వరస షూటింగ్ ల బిజీ లో పవన్

వరస షూటింగ్ ల బిజీ లో పవన్
X

ఎవరైనా ఒకటే పని చేస్తారు. కొంత మంది మాత్రం డబల్ డబల్ పనులు చేస్తుంటారు. ఈ జాబితాలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు అని చెప్పొచ్చు.. ఎందుకంటే అయన నిన్న మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో వారాహి యాత్ర ద్వారా రాజకీయ వేడి పుట్టించి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డ్యూటీ ఎక్కారు. అదే సినిమా షూటింగ్ ల్లో పాల్గొనటానికి పూర్తి సన్నద్ధం అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కు సంబదించిన వర్కింగ్ స్టిల్స్ ను చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రాబోయే రోజుల్లో రాజకీయం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండటంతో ఈ లోగానే పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సత్వరమే ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని...తర్వాత ఓజీ పేరుతో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశం ఉంది అని సమాచారం.

ఈ సినిమా ను సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెండింగ్ లో ఉన్న హరి హర వీర మల్లు సినిమాపై మాత్రం అంతా మౌనంగా ఉన్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించి బ్రో సినిమా ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల అయినా ఈ సినిమా టీజర్ మంచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్ పూర్తి అయితే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తి అయినట్లు అవుతుంది అని చెపుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ఉంది అని చెపుతున్నా ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story
Share it