Telugu Gateway
Cinema

పవన్ కొత్త సినిమా ప్రారంభం

పవన్ కొత్త సినిమా ప్రారంభం
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమా షూటింగ్ లు చేస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన..ఇప్పుడు 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ల కూడా పాలుపంచుకున్నారు. ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో వెంకటేష్ తో కలసి పనిచేసిన పవన్ ఇప్పుడు రానాతో జట్టుకట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. పవన్‌తోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. వీరిద్దరికి సంబంధించిన వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌‌ ప్లేతో పాటు మాటలు అందిస్తున్నాడు. ఇందులో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు.

Next Story
Share it