Telugu Gateway
Cinema

హరి హర వీర మల్లు ఆన్ ట్రాక్ !

హరి హర వీర మల్లు ఆన్ ట్రాక్ !
X

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా హరి హర వీరమల్లు. శ్రీ రామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ రిలీజ్ చేయటంతో పాటు త్వరలో టీజర్ విడుదల చేయన్నునట్లు వెల్లడించారు. మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో కేవలం పవన్ కళ్యాణ్ కళ్ళు మాత్రమే కనిపించే లుక్ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. టీజర్ త్వరలో అన్నారు కానీ...తేదీని మాత్రం వెల్లడించలేదు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. మధ్యలో నిర్మాతలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినా కూడా పెద్దగా కదలికలు ఎక్కడ కనపడలేదు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం చిత్ర యూనిట్ మరో సారి త్వరలో టీజర్ అని పవన్ ఫ్యాన్స్ లో అసలు నింపింది అనే చెప్పాలి.

Next Story
Share it