Telugu Gateway
Cinema

ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ షూటింగ్ లో పవన్

ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ షూటింగ్ లో పవన్
X

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమా పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి వెళ్లి ఆయనతో కింగ్డమ్ టీం భేటీ అయింది. ఇందులో ఈ సినిమా నిర్మాత నాగ వంశీ తో పాటు హీరో విజయదేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తున్న శ్రీ లీల కూడా ఇందులో ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ మూవీ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా హరి హర వీర మల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఇప్పుడు కింగ్డమ్ కు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం హీరో విజయదేవరకొండ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు కింగ్డమ్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి కొద్ది గంటల్లోనే ప్రేక్షకులు ఈ సినిమా ఫలితాన్ని తేల్చబోతున్నారు.

Next Story
Share it