పవన్ కళ్యాణ్ క్లాప్

మన శంకరవర ప్రసాద్ సినిమా సూపర్ హిట్ కావటంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా కూడా ఇది నిలిచింది. ఈ మూవీ ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల రూపాయలపైనే గ్రాస్ వసూళ్లు సాధించింది. గురువారం నాడు చిరంజీవి కొత్త సినిమా మొదలైంది. ఇది మెగాస్టార్ 158 వ సినిమా. ఈ మూవీ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మరో సోదరుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. చిరంజీవికి వాల్తేర్ వీరయ్య వంటి మాస్ హిట్ మూవీని అందించిన దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.



