Telugu Gateway
Cinema

పాత్ర లాయర్..మమకారం పోలీసులపై!

పాత్ర లాయర్..మమకారం పోలీసులపై!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం నాడు తన ఏపీ పర్యటనలోనూ పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శల కోసం ' ఈ వకీల్ సాబ్'ను వాడేశాడు. వకీల్ సాబ్ అంటే...లాయర్ పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ పవన్ కళ్యాణ్ పాత్రే ఏమో లాయర్...కానీ ఆయన మమకారం చూపించేది మాత్రం పోలీసులపై. అదేంటి అంటారా?. ఇదిగో ఈ ఫోటో చూడండి. 'వకీల్ సాబ్ సినిమా షూటింగులో స్టిల్ ఇది.

ఈ సినిమా లో ఓ సన్నివేశంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ జరుగుతుంది పోలీసుల షీల్డ్ మీద స్టూడెంట్స్ కొడతారు. పోలీస్ అనే లెటర్స్ మీద కొట్టడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ ఆ స్టిక్కర్స్ తొలగించారు. ఆ శాఖ మీద ఉన్న గౌరవం తోనే స్టికర్స్ తీసేయాలని నిర్ణయించినట్లు' చిత్ర యూనిట్ చెబుతోంది. పవన్ కళ్యాణ్ తండ్రి గతంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు బహిరంగంగా కూడా ప్రస్తావించారు.

Next Story
Share it